దీపావళి నాడు ఈ పూజలు చేస్తే అదృష్టం.. జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే?

by Disha Web Desk 9 |
దీపావళి నాడు ఈ పూజలు చేస్తే అదృష్టం.. జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ సంవత్సరం అధిక మాసం నేపథ్యంలో పండుగలన్నీ రెండు రోజులతో వస్తున్నాయి. ప్రస్తుతం దీపావళి పండగకు ఇదే పరిస్థితి ఎదురైంది. మరీ ఇంతకీ ఈ ఫేస్టివల్ ఎప్పుడు జరుపుకోవాలి? ఈనెల(నవంబరు) 12 వ తారీకా? లేక 13 వ తేదీనా? అసలు జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

దీపావళి జీవితంలోని చీకట్లను పారదోలుతూ వెలుగులు నింపే పండగ. ఈ పండగను విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. దీపావళి రోజు ప్రతి ఇల్లు దీపపు కాంతులతో వెలిగిపోతుంది. ప్రతి ఇంటా లక్ష్యీ పూజ, బాణసంచా మోతలు మోగిపోతాయాయి. సాధారణంగా హిందువుల పండగల్లో తిథి సూర్యోదయానికి ఉండడమే లెక్క. కానీ దీపావళికి సాయంత్రం లక్ష్యీపూజ చేసి.. దీపాలు వెలిగిస్తారు. కాబట్టి అమావాస్య ఘడియలు ఉన్న సాయంత్రం రోజునే జరుపుకోవడం మంచిదంటారు.

అయితే అమావాస్య ఘడియలు 12, 13 తేదీల్లో రావడంతో చాలా మంది గందరగోళంలో పడ్డారు. తాజాగా జ్యోతిష్య నిపుణులు దీనిపై స్పష్టత ఇస్తున్నారు. నవంబరు 12 వ తేదీ ఆదివారం మధ్యాహ్నం నుంచి అమావాస్య ఘడియలు మొదలై.. 13 వ తారీకు మధ్యాహ్నం ముగుస్తాయట. దీంతో సాయంత్రం ఉండే అమావాస్య ఘడియలను లెక్కలోకి తీసుకొని 12 వ తారీకున దీపావళి జరుపుకోవాలని చెబుతున్నారు.

దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి?

దీపావళి 5 రోజుల పండగ. ధనత్రయోదశితో మొదలై.. యమద్వితీయతో పూర్తి అవుతుంది. కాగా ఈ ఐదు రోజులు దీపావళి పండగను ఈ విధంగా ఆచరించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఎప్పుడెప్పుడో ఏ తేదీల్లో ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం..

* ఈ నెల (నవంబరు)11 వ తేదీన శనివారం త్రయోదశి చేత ధనత్రయోదశి పూజను ఆచరించాలి.

* 12 న ఉదయం నరకచతుర్దశికి సంబంధించినటువంటి స్నాన, దాన, తర్పణ, పితృకర్మలు లాంటివి ఆచరించి.. రాత్రి అమావాస్య సమయంలో లక్ష్మీ దేవిని పూజించాలి.

* 13 వ తారీకున సోమవారం వ్రతం, కేదారగౌరీవ్రతం వంటివి ఆచరించాలి.

* 14 వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుందని.. కావున ఈ రోజు బలిపడ్యమి, 15న యమద్వితీయతో ఈ 5 రోజుల దీపావళి పండగ సంపూర్ణం అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.



Next Story

Most Viewed