నవరాత్రులలో కలశ స్థాపన ఎందుకు చేస్తారు.. దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసా.. ?

by Disha Web Desk 20 |
నవరాత్రులలో కలశ స్థాపన ఎందుకు చేస్తారు.. దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసా.. ?
X

దిశ, ఫీచర్స్ : హిందూ క్యాలెండర్ ప్రకారం, చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9న ప్రారంభమై ఏప్రిల్ 17న ముగుస్తుంది. నవరాత్రులలో మొదటి రోజున కలశాన్ని స్థాపించే సంప్రదాయం ఉంది. మొదటి రోజు దుర్గామాత రూపమైన శైలపుత్రిని భక్తిశ్రద్దలతో పూజిస్తారు. కలశ స్థాపన లేకుండా నవరాత్రుల 9 రోజుల ఆరాధన అసంపూర్ణంగా పరిగణిస్తారు. ఈ కలశాన్ని మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు పూజలో ఉంచుతారు. తర్వాత దశమి తిథి నాడు నిమజ్జనం చేస్తారు. అసలు నవరాత్రి సమయంలో కలశాన్ని ఎందుకు పూజించాలి, ఘటస్థాపన విధానం అంటే ఏమిటి, కలశ స్థాపనకు అనుకూలమైన సమయం ఏమిటి అనే విషయాలు చాలా మందికి తెలిసి ఉండదు. మరి ఆ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నవరాత్రులలో కలశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు ?

హిందూ మతంలో కలశాన్ని మాతృశక్తి, త్రిమూర్తులు, త్రిగుణాత్మక శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇందులో బ్రహ్మ, విష్ణువు, శివుడు మినహా అందరు దేవతలు ఉంటారు. చైత్ర నవరాత్రి పూజలకు ముందు కలశాన్ని ప్రతిష్టించే సంప్రదాయం ఉంది. ఇలా చేయడం వల్ల దేవీ దేవతలందరూ ఆ పూజకు సాక్షులుగా మారి ఉపవాసం ఉండి పూజ చేసిన పూర్తి ఫలితాలు పొందుతారు.

కలశ స్థాపన సమయంలో దేవతలను ఆవాహన చేసి, దానిని పూజా స్థలంలో పెడతారు. అప్పుడు ఆదిశక్తి మాత దుర్గను ఆవాహన చేస్తారు. ఆ తర్వాత తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ ప్రారంభిస్తారు. కలశం నోటిలో విష్ణువు, మెడలో శివుడు, మూలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. కలశంలో నింపిన నీరు స్వచ్ఛత, చల్లదనం, పరిశుభ్రతకు చిహ్నం.

కలశ స్థాపన విధానం ఏమిటి ?

నవరాత్రులు మొదలైన రోజు ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేయాలి. తరువాత పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి. ఆ తర్వాత పూజామందిరంలో ఓ పీట వేసి దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరచాలి. అనంతరం దుర్గామాత విగ్రహాన్ని కానీ లేదు చిత్రపటాన్ని కానీ ప్రతిష్టించాలి. తర్వాత కలశ స్థాపన చేసేందుకు మట్టి లేదా రాగి కలశంలో స్వచ్ఛమైన గంగాజలం పోసి నింపాలి. ఆ చెంబులో తమలపాకులు, కుంకుమ, నాణెం వేసి రెడీ చేయాలి.

దీని తరువాత ఎరుపురంగు చున్నీని కానీ లేదా జాకెట్ ముక్కను తీసుకోవాలి. దానిని కలశానికి దారం కట్టి కలశానికి కట్టండి. తర్వాత ఓ కొబ్బరి కాయను కలశం చెంబు పై పెట్టి ఒక వస్త్రాన్ని మౌలిని కట్టండి. తర్వాత ఓ మట్టిపాత్రనను తీసుకొని అందులో మట్టిని వేసి శనగలు, మినుములు విత్తండి. ఈ తర్వాత కలశాన్ని, విత్తనాలు ఉన్న పాత్రను అమ్మవారి చిత్రపటానికి కుడి వైపున వచ్చేలా చేయాలి.

Next Story

Most Viewed