కలలో కోతులు కనిపిస్తున్నాయా.. శుభమా.. అశుభమా..

by Disha Web Desk 20 |
కలలో కోతులు కనిపిస్తున్నాయా.. శుభమా.. అశుభమా..
X

దిశ, ఫీచర్స్ : నిద్రపోయిన ప్రతి మనిషికి ఏదో ఒకరోజు, ఏదో ఒక కల వస్తూ ఉంటుంది. అయితే కొన్ని కలలు తెల్లవారుజామున వస్తే, మరి కొన్ని కలలు నడిరాత్రిలో వస్తుంటాయి. అయితే ఈ కలల్లో పక్షులు, జంతువులు, చెట్లు, నీళ్లు, మనుషులు ఇలా ఎన్నో రకాలుగా వస్తుంటాయి. వాటిలో కొన్ని శుభసంకేతాలుగా, మరికొన్ని అశుభసంకేతాలుగా పరిగణిస్తారు.

అలాగే స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కల ఒక వ్యక్తి జీవితానికి సంబంధించినది. నిద్రలో మనం ఏ కల చూసినా మన భవిష్యత్తుకు సంబంధించినదే. అయితే మీ కలలో కోతి వస్తే దాని అర్థం ఏమిటో చాలా మందికి తెలిసి ఉండదు. ఈ రకమైన కల శుభదా, అశుభమా ఇప్పుడు తెలుసుకుందాం.

కలలో కోతి పోరాడుతున్నట్లు చూడటం..

మీ కలలో కోతులు పోట్లాడుకోవడం మీకు కనిపిస్తే, భవిష్యత్తులో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే అలాంటి కలలు వచ్చినప్పుడు మీ కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉందని సూచిస్తుంది. సంబంధాలలో దూరాలు పెరగవచ్చు. మీకు అలాంటి కల వచ్చినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు.

కలలో ఈత కొడుతున్న కోతిని చూడటం..

మీ కలలో కోతి ఈత కొడుతున్నట్లు కనిపిస్తే రాబోయే సమయం మీకు చాలా శుభం జరుగుతుందని స్వప్న శాస్త్రం చెబుతుంది. అలాంటి కల వస్తే అదృష్టంగా భావిస్తారు. అంతే కాదు మీ జీవితంలోని సమస్యల నుండి త్వరలో ఉపశమనం పొందుతారని పండితులు చెబుతున్నారు. కలలో కోతి కరిచినట్లయితే, భవిష్యత్తులో ఏదైనా తీవ్రమైన గాయం జరగబోతోందని అర్థం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదంటున్నారు.

కలలో తింటున్న కోతిని చూడటం

డ్రీమ్ సైన్స్ ప్రకారం కలలో కోతి తింటున్నట్లు కనిపిస్తే అశుభ సంకేతంగా పరిగణిస్తారు. అలాగే కోపంతో ఉన్న కోతిని కలలో చూడటం కూడా అశుభ సంకేతంగా పరిగణిస్తారు. ఇలాంటి కలలు వస్తే ఆర్థిక నష్టం జరుతుందని చెబుతున్నారు.

నవ్వుతున్న కోతి ..

మీ కలలో కోతి నవ్వుతున్నట్లు కనిపిస్తే గుడ్ టైం ప్రారంభం కాబోతోందని అర్థం. కోతి సంతోషంగా ఉన్నట్లు కల వస్తే శుభపరిణామంగా చెబుతారు. ఇలాంటి కలలు వస్తే మీ జీవితంలో గౌరవం పెరుగుతుందని చెబుతున్నారు.

కోతుల గుంపు..

కోతుల గుంపు కలలో వస్తే శుభపరిణామంగా భావిస్తారు. వారి జీవితంలో ధనప్రాప్తి కలుగుతుందని స్వప్న శాస్త్రం చెబుతుంది.


Next Story