Vinayaka Chavithi 2023 : వినాయక చవితి జరుపుకోవడంలో ఆంతర్యం గురించి తెలుసుకుందాం..!

by Disha Web Desk 1 |
Vinayaka Chavithi 2023  : వినాయక చవితి జరుపుకోవడంలో ఆంతర్యం గురించి తెలుసుకుందాం..!
X

ఈతరం యువత విఘ్నేశ్వరుడి గురించి అనేక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి గ్రామంలో యువత ప్రధాన కూడళ్లు మండపాలను ఏర్పాటు చేసి గణేష్ విగ్రహాలకు ప్రతిష్టించి పూజలు చేసేందుకు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. కానీ, అసలు వినాయక చవితి జరుపుకోవడంతో ఉన్న ఆంతర్యం తెలియకపోవచ్చు. మన పూర్వీకులు ఎన్నో గ్రంథాల్లో పూజా విధానంలో ఆంతర్యాన్ని, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసినప్పటికీ కాలక్రమేనా అవి మరుగున పడిపోయాయి. నేటి యువత పూజ కంటే అక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా యువత వినాయక చవితిని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

1. వినాయక చవితిలో ప్రాధాన్యత సంతరించుకున్న పూజా ద్రవ్యాలైన 21 చెట్ల ఆకులను పూజిస్తుంటారు. వాటిని గురించి ముందుగా తెలుసుకుందాంజ..! మానవ జీవనానికి అవసమైంది ప్రాణ వాయువు అది చెట్ల నుంచే లభిస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే దాతో పాటు మానవుడికి సంక్రమించే అనేక వ్యాధులకు దివ్య ఔషధంగా చెట్ల ఆకులు ఉపయోగపడతాయి. వాటి నుంచి తయారు చేసిన ఔషధాలను తీసుకోవడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోతాయని ఆయుర్వేద శాస్త్రం చెప్పకనే చెబుతుంది. దానిని దృష్టిలో పెట్టుకుని 21 పత్రాలతో (ఆకులు) వినాయకుని పూజిస్తారు. అందుకే చెట్ల ఆకులతో పూజ చేయమని పెద్దలు చెప్పేది.

2. విఘ్నేశ్వరుడి అలంకార ఆభరణాలుగా అనేక జీవరాసులు సృష్టిలో ఉన్నాయి, వాటి ముఖ్య ఉద్దేశం తెలుసుకుందాం..! విఘ్నేశ్వరునికి వాహనంగా ఎలుక, యజ్ఞోపవీతంగా పాము, తల భాగాన్ని ఏనుగుతో ఉంటుంది. అదేవిధంగా అతడి సోదరుడు కుమార స్వామికి నెమలి వాహనం. తండ్రి శివుడికి నంది వాహనంగా ఉండటం మనందరికీ తెలిసిందే. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే.. అనేక జంతువులతో సహజీవనం చేయడం అందులోని ఆంతర్యం. పక్షులు మనకు హానీ కలిగించి సూక్ష్మజీవులు, క్రిమి కీటకాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన రక్షణ, ప్రకృతిని అవి పరిరక్షించడంలో జీవరాసులు ఎంతగానో తోడ్పడుతున్నాయి.

3. గణపతి విగ్రహాన్ని చెరువులోని కొత్తగా మట్టిని సేకరించి ఆ మట్టితో వినాయక విగ్రహాన్ని తయారు చేయడంతో పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపొందుతుంది. అదేవిధంగా నీటి నిలువ ఉంచే విధానంతో పాటు నీటి పరిశుభ్రత గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. వినాయక విగ్రహం నిమజ్జనం ఎందుకు చేయాలని సందేహం రావొచ్చు. చెరువులు, బావులు, నదులు, వీటిలో వర్షాల వల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం. అయితే, ఆ నీటిని శుభ్రం చేసేది ప్రతిష్టించిన గణపతితో పాటు ఉన్న 21 ఆకులతో కూడా పత్రి అందుకు సమాధానం. అందుకే తొమ్మిది రోజుల పూజ తర్వాత ఆ పత్రితో పాటు మట్టి విగ్రహాన్ని నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేస్తారు. అలా నీటిలో కలిపిన మట్టి 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక అందుల ఉన్న ఔషధ గుణాల ఆల్కలాయిడ్స్‌ని ఆ జలంలోకి వదిలేస్తాయి. దీంతో జీవ రాసులకు పశు పక్షాదులకు, మానవ జీవనానికి ఆధారభూతమైన నీటిని శుభ్రపరిచడంలో పత్రి ఎంతగానో ఉపయోగపడుతుంది.

రొంపిచర్ల రఘురామ చక్రవర్తి, మేళ్లచెరువు.



Next Story

Most Viewed