ఆ ఆలయంలో అద్భుతం.. రోజుకు మూడుసార్లు రంగు మారుతున్న అమ్మవారు..

by Disha Web Desk 20 |
ఆ ఆలయంలో అద్భుతం.. రోజుకు మూడుసార్లు రంగు మారుతున్న అమ్మవారు..
X

దిశ, ఫీచర్స్ : మన దేశంలో అద్భుతమైన దేవాలయాల జాబితా చాలానే ఉంది. కొన్ని ఆలయాల్లో తంత్ర సాధన నిర్వహిస్తే, మరికొన్ని చోట్ల విగ్రహాల రంగులు మారుతుంటాయి. కొన్ని చోట్ల అమ్మవారి విగ్రహం కొన్నిరోజుల్లో రూపాంతరం చెందుతుంది. మరికొన్ని చోట్ల ఆలయ విగ్రహం ఒక నిర్దిష్ట తేదీన గర్భగుడి నుండి బయటకు వస్తుంటుంది. అలాంటి ఒక దేవాలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయంలోని రహస్యాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ లక్ష్మీ దేవి ఆలయం జబల్‌పూర్‌..

మనం చెప్పుకుంటున్న లక్ష్మీ దేవి ఆలయం జబల్‌పూర్‌లో ఉంది. దీనిని పచ్చమత అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని 1100 సంవత్సరాల క్రితం గోండ్వానా పాలనలో రాణి దుర్గావతికి ప్రత్యేక సేవకురాలిగా ఉన్న దివాన్ అధర్ సింగ్ పేరు మీద అధర్తల్ చెరువులో నిర్మించారు. ఈ ఆలయంలో లక్ష్మీదేవితో పాటు ఇతర దేవతల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు.

ఈ ఆలయం తంత్ర సాధనకు ప్రసిద్ధి..

పచ్చమత దేవాలయం తంత్ర సాధనకు ప్రసిద్ధి చెందింది. ఆలయ సముదాయం చుట్టూ శ్రీయంత్ర ప్రత్యేక నిర్మాణం ఉందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ ఆలయంలో ప్రతిష్టించిన లక్ష్మీ దేవి విగ్రహం రోజుకు మూడు సార్లు రంగు మారుతుందని అక్కడి భక్తులు, ఆలయంలోని పండితులు చెబుతున్నారు. విగ్రహం రంగు ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపు, సాయంత్రం నీలంగా మారుతుందట.

తల్లి పాదాల పై సూర్యుని మొదటి కిరణాలు..

ఆలయంలోని విగ్రహం రంగు మారడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే ఇక్కడ పడే సూర్యుని మొదటి కిరణం లక్ష్మీదేవి పాదాల పై పడుతుంది. లక్ష్మీదేవిని దర్శించుకోవడానికి సూర్యభగవానుడు కూడా వస్తాడని ఇక్కడికి వచ్చే భక్తుల అభిప్రాయం.

శుక్రవారం గురించిన నమ్మకం..

శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేశారు. సాధారణ రోజుల్లో కంటే శుక్రవారాల్లో రద్దీ ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం. 7 శుక్రవారాలు క్రమం తప్పకుండా ఇక్కడికి వచ్చి అమ్మవారి పాదాలను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. అంతే కాదు, లక్ష్మీ దేవి అనుగ్రహంతో భక్తుడు ఎప్పుడూ డబ్బు, ధాన్యాల కొరతను ఎదుర్కోరట.



Next Story

Most Viewed