Ganesh Chaturthi : గణేషుడికి వీటిని సమర్పిస్తే ఇంట్లో అన్నీ శుభాలే..

by Disha Web Desk 6 |
Ganesh Chaturthi : గణేషుడికి వీటిని సమర్పిస్తే ఇంట్లో అన్నీ శుభాలే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజు గణేష్ చతుర్థి కావడంతో నగరాలన్నీ సందడిగా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో గల్లీ గల్లీలో గణేషుడిని ప్రతిష్టించడానికి మండపాలు రెడీగా ఉన్నాయి. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఫ్యామిలీస్‌లో జరుపుకుంటూ ఈ 9 రోజులు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ప్రతి శుభ కార్యానికి ముందు వినాయకుడినే పూజిస్తారు. గణేష్ చతుర్థి పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి నాడు జరుపుకుంటారు. గణేషుడికి ఈ వస్తువులను సమర్పిస్తే ఇంట్లో అన్ని కష్టాలు తొలగిపోయి శుభాలు వింటారట అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

*గణేషుడి ఆరాధనలో గరిక లేకుండా అసంపూర్ణంగా పరిగణిస్తారు. శ్రీ గణేషుడికి గరిక చాలా ప్రియం. ఎవరైతే గణేశుడికి గరికను సమర్పిస్తారో, వారి జీవితంలో ఆనందం ఉంటుంది.

*అలాగే ప్రతి శుభకార్యంలో పసుపు ముఖ్యం. వినాయకుడి పూజలో పసుపు ముద్దను పెడితే కష్టాలు దూరమయి సుఖ సంతోషాలు ఉంటాయి.

*మోదకాలు ,లడ్డూలు గణేశుడికి చాలా ఇష్టమైనవి. కాబట్టి వీటిని పూజలో పెడితే కోరికలు నెరవేరుతాయి.

*పూజలో వినాయకుడికి సమర్పించే వాటిలో తమలపాకు ఒకటి. వీటిని పెడితే ఇంట్లో మంచి జరుగుతుంది.

* ప్రతి పూజలో ఉపయోగించే కొబ్బరికాయలు పెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.

Next Story

Most Viewed