కార్తీకమాసంలో ఆ ఒక్క రోజు పూజ చేస్తే చాలు.. ఎంతో పుణ్యఫలం లభిస్తుంది..!

by Disha Web Desk 7 |
కార్తీకమాసంలో ఆ ఒక్క రోజు పూజ చేస్తే చాలు.. ఎంతో పుణ్యఫలం లభిస్తుంది..!
X

దిశ, వెబ్‌డెస్క్: హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే కార్తీక మాసం ప్రారంభమైంది. శ్రీ మహావిష్ణువు, శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం ప్రామంభమవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. అయితే.. కార్తీక మాసంలో ఇలా చేస్తే కొన్ని ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు పండితులు.

కార్తీక పౌర్ణమి (నవంబర్ 27) రోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాల్లో భక్తులు దీపాలు వెలిగిస్తారు. కార్తీకపౌర్ణమి రోజున స్త్రీలు తమ సౌభాగ్యం కోసం భక్తేశ్వర అనే వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజు చేసే నదీ స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వలన ఈ కాలపు వాతావరణ పరంగా మనకు ఎంతో ఆరోగ్యం కూడా లభిస్తుంది.

ప్రస్తుతం చాలా మంది బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. పూజలు పురస్కారాలకు వారి దగ్గర తగిన సమయం ఉండటం లేదు. అయితే.. కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి నాడు పూజ చేస్తే.. నెలంతా పూజలు చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున స్త్రీలు ప్రత్యేకంగా పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి, ఫలహారంగా స్వీకరించాలని చెబుతున్నారు పండితులు. ఇలా చేయడం వల్ల బిడ్డలకు రక్షణ కరంగా ఉంటుందని పెద్దలంటారు.

ఈ పౌర్ణమి రోజు చేసే ప్రతి పూజలో ఫలితం ఉంటుంది. పౌర్ణమి రోజున శివాలయాల్లో జరిపే జ్వాలా తోరణానికి మరో ప్రత్యేకత ఉంది. ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారు ఈరోజు. వాటిలో వృషవ్రతం, మహీఫల వ్రతం, నానా ఫల వ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమ వ్రతం, సత్యనారాయణ వ్రతం, కృత్తికా వ్రతం లాంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్ష బిల్వార్చన, లక్ష ప్రదక్షిణ, లక్ష వత్తులు, లక్ష రుద్రం లాంటి పూజలు చేస్తారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సిన ప్రత్యేక పూజలు దైవ దర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణ. పౌర్ణమి రోజున ఈ పూజలు చేస్తే విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయని పండితులు చెబుతున్నారు.

Next Story

Most Viewed