కార్తీక మాసంలో పెళ్లి కానీ వారు చేసే పూజలు ఏంటో తెలుసా..?

by Disha Web Desk 7 |
కార్తీక మాసంలో పెళ్లి కానీ వారు చేసే పూజలు ఏంటో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: హిందూ సంప్రదాయాల్లో కార్తీక మాసానికి విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసం శ్రీమహావిష్ణువు పూజకు అంకితం చేయబడిందని పురాణాల్లో ఉంది. ఈ ఏడాది కార్తీక మాసం నవంబర్ 14 న ప్రారంభమై.. డిసెంబర్ 13తో ముగుస్తుంది. అయితే.. కార్తీక మాసాన్ని వ్రతాల మాసంగా కూడా పరిగణించబడుతుంది. ఈ మాసంలో ఎంతో పూజలు చేస్తే పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. అంతే కాకుండా పెళ్లి కాని వారికి కార్తీక మాసం ఎంతో ప్రాముఖ్యమైనది. తులసి మొక్కకు ఎంతో మంది పూజలు చేస్తుంటారు.

అదే కార్తీక మాసంలో అయితే మరింత శ్రద్ధగా ఈ పూజలు నిర్వహిస్తారు. తులసి వివాహం కూడా కార్తీక మాసంలోనే జరిగిందట. అందుకే ఈ మాసంలో పెళ్లి కానీ వారు తులసి మొక్కకు పూజలు, కొన్ని పరిహారాలు చేస్తే తొందరగా పెళ్లిళ్లు జరుగుతాయని పూర్వీకుల నమ్మకం. అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు వస్తే తులసి మొక్కకు పూజలు చేయడం ద్వారా మంచి జరుగుతుందని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. మరీ తులసి మొక్కకు ఎలా పూజలు చేయాలి, ఏం సమర్పించుకోవాలి అనేది తెలుసుకుందాం..

* వైవాహిక సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించిన అనంతరం తులసి మొక్కకు నీళ్లు సమర్పించుకోవాలి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల వైవాహిక జీవితంలో వచ్చిన సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయని చెబుతున్నారు పండితులు.

* అమ్మాయిలకు తగిన వరుడు దొరకాలంటే కార్తీక మాసంలో ఏకాదశి నాడు తులసి కళ్యాణం ఖచ్చితంగా చేస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

* హిందూమతంలో ఎర్ర చందనాన్ని సంతోషానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి లేదా ఏకాదశి నాడు తులసి మాతకు ఎర్రచందనం సమర్చించినట్లుయితే.. వైవాహిక జీవితంలో సమస్యలు లేదా, పెళ్లి సమస్యలు తీరుతాయని పండితులు చెబుతున్నారు.



Next Story

Most Viewed