తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

by Disha Web Desk 6 |
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు సెలవు కావడంతో తిరుమలలో భక్తులు రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో జనాలు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలివెళ్తున్నారు. అయితే శ్రీవారి దర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతుందని సమాచారం. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబరు 17వ తేదీన తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 135వ జ‌యంతి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 8.30 గంటలకు శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం ఉంటుంది. అనంత‌రం ఉదయం 9 గంటలకు అన్నమాచార్య కళామందిరంలో సభా కార్యక్రమం నిర్వహిస్తారు.

Next Story

Most Viewed