తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు..

525

దిశ, ఏపీబ్యూరో : తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.సమాజంలో హింస, విధ్వంసాలకు చరమగీతం పాడిన రోజును శుభదినంగా జరుపుకోవాలన్నారు. బలహీనులపై దాడులు, దౌర్జన్యాలు అంతమైన రోజున ప్రతి ఒక్కరీ జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు.

డిప్యూటీ సీఎం అంజాద్ బాషా..

అజ్ఞాన చీకట్లను పారద్రోలి ప్రతిఒక్కరీ జీవితాల్లో దీపావళి పండుగ కొత్త వెలుగులు నింపాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి ఎస్​బీ అంజాద్ బాషా కోరారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి సిరులు కురిపించాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడ్ని కోరుకుంటున్నట్లు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..