ఇంటి వద్దకే ‘ఆక్సిజన్’ డెలివరీ

by  |
ఇంటి వద్దకే ‘ఆక్సిజన్’ డెలివరీ
X

న్యూఢిల్లీ: ఆప్ సర్కార్ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఆక్సిజన్ కొరతను తట్టుకుని నిలిచేందుకు గాను కొన్ని కీలక చర్యలను సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీలోని అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంకులు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా పేషెంట్లు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇంటి వద్దకే హోం డెలివరీ చేయించుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు.

‘నేటి నుంచి ఓ ముఖ్యమైన సర్వీసును ప్రారంభిస్తున్నాము. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ప్రతి జిల్లాలో 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో కూడిన ఓ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైన సమయంలో మెడికల్ ఆక్సిజన్ అందించక పోవడం వల్ల కోవిడ్ పేషెంట్లు ఐసీయూల్లో చేరాల్సి వస్తోంది. కొన్ని సార్లు ఆ పేషెంట్లు మరణిసున్న వార్తలు కూడా వింటున్నాం. ఈ సమస్యలను తీర్చేందుకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నాం. ఒక వేళ హోం ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్‌కు మెడికల్ ఆక్సిజన్ అవసరం ఉంటే మా టీమ్ వారి ఇంటికి రెండు గంటల్లో మెడికల్ ఆక్సిజన్ హోం డెలివరీ చేస్తుంది. వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన వారికి కూడా కొన్ని సార్లు ఆక్సిజన్ అవసరం ఏర్పడవచ్చు. అలాంటి వారు కూడా మమల్ని సంప్రదించ వచ్చు. మా వైద్యులు కూడా వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు ఉంటారు. ఒక వేళ ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉంటే వెంటనే స్పందిస్తాం’ అని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.



Next Story

Most Viewed