జీతాలు మినహా వేరే ఖర్చులన్నీ ఆపేయండి : కేజ్రీవాల్

by  |
జీతాలు మినహా వేరే ఖర్చులన్నీ ఆపేయండి : కేజ్రీవాల్
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పంజా విసురుతున్న కాలంలో ఢిల్లీ ప్రభుత్వ ఖజానాను దృష్టిలో పెట్టుకుని సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వైరస్ పై పోరాడేందుకు ప్రభుత్వ ఖర్చులను ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు. వేతనాలు మినహా అన్ని ప్రభుత్వ ఖర్చులను నిలిపేయాలని అన్ని ప్రభుత్వ శాఖలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఆదేశించారు.

20 హాట్‌స్పాట్‌లు సీల్:

కరోనా వైరస్ విస్తరణపై కఠిన చర్యలు తీసుకుంటూ ఢిల్లీలోని 20 (సంగం విహార్, మాల్వియా నగర్, జహంగీర్ పురి) ను గుర్తించి పూర్తిగా సీల్ చేసేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు సహా చిన్నచిన్న సెటిల్‌మెంట్ వీధులున్న 20 ఏరియాల హాట్‌స్పాట్‌లను సీల్ చేయనున్నట్టు తెలిపింది. ఈ హాట్‌స్పాట్‌ల నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపేయనుంది. అయితే, అత్యవసర సరుకులు హోం డెలివరీ అయ్యేట్టు చర్యలు తీసుకోనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. కరోనా కట్టడి కోసం సీనియర్ మంత్రులు, అధికారులతో సీఎం కేజ్రీవాల్ బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మాస్కులు తప్పనిసరి:

ఢిల్లీ ప్రభుత్వం కూడా మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటి నుంచి బయట అడుగు పెట్టినవారు తప్పకుండా మాస్కులు ధరించాలని, వస్త్రాలనైనా ముఖానికి పెట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. బుధవారంనాటి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Tags: Delhi, cm kejriwal, 20 hotspots, seal, masks, mandatory, salaries

Next Story

Most Viewed