టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

by  |
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా మరికాసేపట్లో 47వ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఆసక్తికరపోరు జరగనుంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ కానుక ఓటమి పాలైతే ప్లే ఆఫ్స్ అవకాశాలు చేజారిపోతున్నట్టు పాయింట్ టేబుల్ క్లియర్‌గా సూచిస్తోంది. దీంతో సన్‌రైజర్స్ జట్టు సమిష్టిగా రాణిస్తే తప్ప ఐపీఎల్‌లో నిలదొక్కుకోవడం కష్టమే అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇరు జట్ల సామర్థ్యాలు…

ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ను పరిశీలిస్తే ఈ సీజన్‌లో అత్యంత శక్తివంతమైన జట్టుగా ప్రదర్శన కనబరుస్తోంది. యువఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో ఢిల్లీ మంచి పర్ఫామెన్స్ చూపిస్తోంది. ఇప్పటికే 11 మ్యాచులు ఆడిన ఢిల్లీ 7 మ్యాచుల్లో విజయపతాకం ఎగురవేసింది. మరో 4 మ్యాచుల్లో పరాజయం పొందింది. 14 పాయింట్లు సాధించి నెట్ రన్‌ రేట్ +0.434తో సీజన్‌లో రెండో స్థానంలో కొనసాగుతుంది.

ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. టాప్ ఆర్డర్(అజింక్య రహనే/పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్) చాలా బలంగా ఉంది. మిడిలార్డర్‌లో కూడా రిషబ్ పంత్, హెట్మేయర్, స్టోయినిస్, అక్సర్ పటేల్‌తో ధృడంగా ఉన్న.. పంత్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్లు మరింత రాణించాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే ఏమాత్రం తీసుపోకుండా ఉంది. కగిసో రబాడా, రవిచంద్రన్ అశ్విన్, స్టోయినిస్ బౌలర్లు రాణిస్తున్నారు. ఇంతటి సామర్థ్యంలతో ఢిల్లీ జట్టు సీజన్‌లో దూసుకుపోతోంది.

ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో ఒడిదుడుకుల మధ్య విజయాలు, పరాజయాలను నమోదు చేస్తున్నారు. టాప్‌ ఆర్డర్ కుప్పకూలితే మిడిలార్డర్ తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా విఫలం అవుతున్నారు. దీనికి తోడు కీలక బౌలర్లు మిచెల్ మార్ష్, భువనేశ్వర్ లాంటి బౌలర్లు టోర్నీ నుంచి వైదొలగడంతో మరింత ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే 11 మ్యాచులు ఆడిన హైదరాబాద్ కేవలం 4 మ్యాచుల్లో విజయం సాధించి.. 7 మ్యాచుల్లో ఘోరా పరాజయం చెందింది.

సన్‌రైజర్స్ బ్యాటింగ్‌ను చూస్తూ.. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో నిలదొక్కుకుంటే మ్యాచ్ వన్‌సైడ్ అవుతోంది. ఇక మిడిలార్డర్‌లో వస్తున్న ఆటగాళ్లు కీలకంగా ఉన్న… చిన్న చిన్న తప్పిదాల కారణంగా వికెట్లు వదిలేస్తున్నారు. ఏదో ఒక్క మ్యాచులో మెరుపు ఇన్నింగ్స్‌ చేస్తున్న జట్టు తగినంత విజయాలను నమోదు చేయలేదు. ఇక ఈ రోజు జరిగే మ్యాచ్‌లో జట్టులోని అందరూ బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు రాణిస్తేనే హైదరాబాద్ గెలుపు లాంఛనమవుతుంది. ఎప్పటిలాగా ఢిల్లీ చెలరేగితే హైదరాబాద్‌ జట్టు కూడా ఫ్లే ఆఫ్స్ పై ఆశలు వదిలేసుకోవాల్సిందే అంటూ కామెంటేటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story

Most Viewed