ఓటమే గెలుపునకు నాంది – ఏఎస్పీ షాకీర్ హుస్సేన్

by  |
ఓటమే గెలుపునకు నాంది – ఏఎస్పీ షాకీర్ హుస్సేన్
X

దిశ, వనపర్తి : రాష్ట్ర హాకీ మహిళా జూనియర్ జట్టులో స్థానం దక్కలేదని దిగులు పడాల్సిన అవసరం లేదని ప్రతి ఓటమి మరొక గెలుపుకు నాందిగా భావించి క్రీడాకారిణిలు పోరాటపటిమను పెంపొందించుకోవాలని వనపర్తి ఏఎస్పీ షాకీర్ హుస్సేన్ కోరారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాలకృష్ణయ్య క్రీడాప్రాంగణంలోఈ నెల మార్చ్ 21తేదీ నుండి23 తేదీ వరకు తెలంగాణహాకీ అసోసి యేషన్ ఆధ్వర్యంలో హాకీ ఉమెన్స్ నేషనల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ లో 30 మంది క్రీడాకారిణిలు ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు.

క్యాంపు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏ ఎస్పీ షాకీర్ హుస్సైన్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వనపర్తి జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు పగిడాల శ్రీనివాస్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి బోలమోని కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏ ఎస్పీ షాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఆడేందుకు రాష్ట్ర హాకీ జట్టులో స్థానం లభించలేదని నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని ఓటమితో పాఠాలు నేర్చుకొని రెట్టింపు ఉత్సాహంతో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఏఎస్పీ అన్నారు.

ఈ క్యాంప్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది క్రీడాకారిణిలను ఇండియన్ ట్రిబుల్ ఒలింపియన్ ముఖేష్, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు ఎంపిక చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని సిందేగా లో నిర్వహించే జాతీయ స్థాయి హాకీ టోర్నమెంట్ లో 18 మంది క్రీడాకారిణిలు పాల్గొటారని తెలంగాణ రాష్ట్ర హాకీ సెక్రెటరీ అల్ఫాన్ ఫిరోస్ తెలిపారు. వనపర్తిలో హాకీ అస్ట్రో టర్ఫ్ గూర్చి ప్రభుత్వ దృష్టి లో ఉంచామని హాకీ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి బోలమోని కుమార్ విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమంలో పీటీ మన్యం యాదవ్,దయానంద్,శిరీష, రాజేశ్వరి,షబ్బీర్,సాట్స్ అకాడమి కోచ్ సాగర్,తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed