అయోధ్యలో ఘనంగా దీపోత్సవ వేడుకలు.. 12లక్షల దీపాలతో రికార్డు బ్రేక్

by  |
అయోధ్యలో ఘనంగా దీపోత్సవ వేడుకలు.. 12లక్షల దీపాలతో రికార్డు బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్ : దీపావళి సందర్భంగా సరయూ నది ఒడ్డున వెలిగించే మట్టి దీపాలతో అయోధ్యలో దీపోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యానాథ్.. అయోధ్యలో దీపోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 12 లక్షల మట్టి దీపాలను వెలిగించనుందని, అందులో తొమ్మిది లక్షల దీపాలను సరయూ నది ఒడ్డున వెలిగిస్తామని పేర్కొన్నారు. ఇది గతేడాది దీపావళి రికార్డును బ్రేక్ చేసినట్టు తెలిపారు.

అంతేకాకుండా గత సంవత్సరం ‘దీపోత్సవ్’ సందర్భంగా ఆరు లక్షలకు పైగా మట్టి దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించామని గుర్తుచేశారు. దీపావళి సందర్భంగా నవంబర్ 1 నుండి 5 వరకు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు కార్యనిర్వాహక అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీలంక నుండి ఒక సాంస్కృతిక బృందాన్ని రామ్‌లీలా వేదికపైకి ఆహ్వానించారు. అయితే.. దీపావళి వేళ ఆకాశంలో రామాయణ దృశ్యాలను ప్రదర్శించే 500 డ్రోన్‌ల ప్రత్యేక ప్రదర్శన హైలైట్‌గా నిలువనున్నట్టు సమాచారం.


Next Story

Most Viewed