భారత్‌లో తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న మరణాలు

by  |
corona, india
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ, మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గకుండా విజృంభిస్తున్నాయి. తాజాగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,11,170 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారినపడి తాజాగా.. 4,077 మంది మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 2,46,84,077కి చేరింది. మరణాల సంఖ్య 2,70,284కు పెరిగింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.07 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 3,62,437 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,07,95,335కి చేరింది. రికవరీ రేటు 84.2 శాతంగా ఉంది. రికవరీ రేటు పెరుగుతుండటం మంచి విషయం. ప్రస్తుతం భారత్‌లో 36,18,458 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 18,32,950 టెస్టులు చేశారు.



Next Story

Most Viewed