AP News : మళ్లీ అక్కడ పగటి పూట కర్ఫ్యూ..ఎక్కడంటే.!

by  |
AP Curfew
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మరణాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్నా తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా అత్యధిక కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. దీంతో జిల్లాలో కర్ఫ్యూ కఠినంగా అమలు చేసిన సంగతి తెలిసిందే. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టడంతో కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 30 వరకు నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలంలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

మళ్లీ కఠిన కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించారు. పి. గన్నవరంలో కరోనా విజృంభిస్తోంది. మండల వ్యాప్తంగా పాజిటివ్ రేటు శాతం పెరుగుతోంది. దీంతో అధికారులు మరో వారం రోజల పాటు కర్ఫ్యూ విధించారు. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు తెరిచేందుకు.. ప్రజలకు బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్ఫ్యూ విధించామని మండల తహసీల్దార్ మృత్యుంజయరావు అధికారికంగా ప్రకటించారు. రేపటి నుండి వారం రోజులు కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.



Next Story

Most Viewed