మోదీ మూడోసారి ప్రధాని కావడం తథ్యం : భరత్ ప్రసాద్

by Disha Web Desk 23 |
మోదీ మూడోసారి ప్రధాని కావడం తథ్యం : భరత్ ప్రసాద్
X

దిశ,గద్వాల: కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని నాగర్ కర్నూల్ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ అన్నారు. బుధవారం మల్దకల్ మండలంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బిజెపి పార్టీ భరత్ ప్రసాద్ కు మద్దతుగా నడిగడ్డ పోరాట హక్కుల సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్దకల్ తిమ్మప్ప ఆలయంలో రంజిత్ కుమార్ తో పాటు, నాగర్ కర్నూల్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ మరియు జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రోడ్ షో ర్యాలీని ప్రారంభించారు.

మల్దకల్ మండల కేంద్రం నుండి ప్రారంభమైన రోడ్ షో సద్దనోని పల్లి, అమరవాయి, బిజ్వారం, ఉలిగేపల్లి, దాసరిపల్లి, మేకల సోంపల్లి గ్రామాల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ.... దేశంలో మూడోసారి మోడీ గెలిస్తే దేశాన్ని పేదరికం లేకుండా భారత్ ని ప్రపంచంలో అగ్రస్థానంగా నిలబెడుతారని అన్నారు. పేద ప్రజలకు,దేశ అభివృద్ధికి పాటుపడుతున్న మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ ని ముచ్చటగా మూడోసారి ప్రధానిని చేయాలని కోరారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నారి శక్తి వందన్ అది నియమ్ బిల్లు పాస్ చేశారని తెలిపారు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆహార భద్రత పథకంతో 80 కోట్ల మందికి బియ్యం పంపిణీ చేసిన ఘనత ప్రధాన మోడీకే దక్కుతుందన్నారు. పీఎం కిసాన్ సన్ నిధి ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి రూ. 6వేల ఆర్థిక సాయం అందిస్తున్నారని, గత పది ఏళ్లలో దేశం సాధించిన అభివృద్ధి వేగంగా మరింత ముందుకు కొనసాగాలంటే నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలని కోరారు.

ఈ సంద్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు ఒప్పుకున్నటువంటి పార్టీగా, బీసీలకు నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చినందుకు గాను అలాగే కేంద్రంలో బీసీలకు క్యాబినెట్ హోదాలో 27 మందికి 12 ఎస్సీలకు,5 మందికి మైనార్టీలకు క్యాబినెట్ హోదాలో స్థానం కల్పించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన గడీలను గద్దె దింపుతా అన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో గడీలపాలనను తయారు చేస్తున్నారని బీసీలకు, ఎస్సీలకు గౌరవం లేకుండా చేస్తున్నారని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ స్థానంలో ఒక్క మాదిగకు కూడా సీటు కేటాయించలేదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు జిల్లా కార్యదర్శి లవన్న మల్దకల్ మండలాధ్యక్షుడు విష్ణు నాయకులు రంగస్వామి, పరశురాముడు, వెంకట్రాములు,మల్దకల్ , ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్,నజిముల్లా,కార్యదర్శి తిమ్మప్ప, ఆశన్న,నేతన్న,లక్ష్మన్న,గోపాల్, చిన్న రాముడు, వీరితోపాటు ఆయా మండల అధ్యక్షులు కార్యదర్శిలు ముఖ్య నాయకులు, ఆయా మండల అధ్యక్షుడు,ఆయా గ్రామాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story