పోస్ట్‌‌మెనోపాజ్ మహిళల ఫిట్‌నెస్ పెంచే ‘డ్యాన్స్ థెరపీ’

by  |
Dancing-improves
X

దిశ, ఫీచర్స్: వ్యాయాయం చేయడం, డైట్ పాటించడం వల్లే కాదు ‘డ్యాన్స్’ చేసి కూడా హ్యాపీగా పొట్ట కరిగించుకోవచ్చు. దీనివల్ల ఫిట్‌నెస్, బాడీ కంపోజిషన్ ఇంప్రూవ్ కావడంతో పాటు సెల్ఫ్ ఎస్టీమ్ కూడా పెంపొందుతుందని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. ప్రధానంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళలకు ‘డ్యాన్స్ థెరపీ’ అద్భుత ఫలితాలు ఇస్తున్నట్లు తేలింది.

సాధారణంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళలు బరువు పెరుగుతుంటారు. వీరి బాడీలో ఫ్యాట్ పెరగడంతో పాటు జీవక్రియలో ఆటంకాల వల్ల గుండె జబ్బులు తలెల్తే ప్రమాదం ఉంది. శరీరంలో వస్తున్న మార్పులు కారణంగా ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవాన్ని కూడా కోల్పోతారు. ఇలాంటి వారికి డ్యాన్స్ థెరపీ’ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా బాడీ కంపోజిషన్, మెటబాలిక్ ప్రొఫైల్, ఫంక్షనల్ ఫిట్‌నెస్, సెల్ఫ్ ఎస్టీమ్ వంటి విషయాల్లో మార్పులు గమనించారు. వారానికి మూడుసార్లు డ్యాన్స్ చేయడం వల్ల రుతుక్రమం ఆగిన మహిళలు అనేక ప్రయోజనాలు పొందొచ్చని పరిశోధకులు చెప్పారు. డ్యాన్స్ థెరపీ లిపిడ్ ప్రొఫైల్.. ఫంక్షనల్ ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడమే కాకుండా ఆత్మగౌరవాన్ని కూడా మెరుగుపరుస్తుందని తెలిపారు. డ్యాన్స్ చేసే సమయంలో బ్యాలెన్సింగ్, భంగిమ నియంత్రణ, నడక, శారీరక పనితీరు వల్ల ఫిట్‌నెస్ ఇంప్రూవ్‌ అయ్యి, కొవ్వు కూడా కరిగిపోతోందని తెలుసుకున్నారు. కాగా ‘నార్త్ అమెరికన్ మెనోపాజ్ సొసైటీ (NAMS)’ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ స్టెఫానీ ఫౌబియోన్ బృందం ఈ అధ్యయనం చేసింది.

‘డ్యాన్స్ అనేది ప్లెజంట్ యాక్టివిటీ. దీనికి అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. రెగ్యులర్‌గా డ్యాన్స్ చేయడం వల్ల ఫిజికల్ పర్ఫామెన్స్ వృద్ధి చెందుతుంది. డ్యాన్స్ థెరపీ ప్రయోజనాల వల్ల మహిళలు హై క్వాలిటీ లైఫ్‌స్టైల్‌ను జీవితాంతం ఆస్వాదించవచ్చు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే మహిళలు కొత్తగా ఏదో నేర్చుకున్న అనుభూతిని పొందుతారు. ఇది ఎంజాయ్‌మెంట్ కాదు ఇందులో ఫిటెనెస్ రహస్యాలున్నాయని గ్రహించాలి. – స్టెఫానీ ఫౌబియోన్


Next Story

Most Viewed