ముంబై గాలిని స్వచ్ఛంగా మార్చిన నిసర్గ

by  |
ముంబై గాలిని స్వచ్ఛంగా మార్చిన నిసర్గ
X

మహానగరం ముంబై పేరు చెప్పగానే ఒకప్పుడు కాలుష్యం, జనాలు, పొగ, దుమ్ము, ధూళి గుర్తుకొచ్చేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. లాక్‌డౌన్ కారణంగా వాహనాలు ఇంటికే పరిమితమవడంతో గాలిలో కాలుష్యం చాలామటుకు తగ్గిందనే వార్తలు వింటున్నాం. అయితే, దీనికితోడుగా వచ్చిన సైక్లోన్ నిసర్గ కూడా ముంబై గాలికి కొంతమేలు చేసింది. అవును.. దాని సహజ వైపరీత్య ప్రభావాలెలా ఉన్నా, నిసర్గ ద్వారా కురిసిన వర్షం కారణంగా ముంబై గాలి స్వచ్ఛంగా మారింది. గురువారం రోజున ముంబై గాలి నాణ్యతాసూచీ 17గా ఉందని, ఇది ఈ ఏడాదిలోనే ఉత్తమ రీడింగ్ అని ‘సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌ క్యాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫార్)’ తెలిపింది.

కాలుష్య కారకాల్లో ముఖ్యంగా ఊపిరితిత్తులు, రక్తంలోకి వెళ్లగలిగే పీఎం 2.5 పర్టిక్యులేట్ మ్యాటర్ రీడింగ్ 15 వద్ద ఉంది. ఆ గాలి పీల్చడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదని అర్థం. ఇలా నమోదవడానికి నిసర్గ ప్రభావంతో వీచిన భారీ గాలులు, ఆ తర్వాత వెంటనే వచ్చిన భారీ వర్షాలే కారణమని సఫార్ డైరెక్టర్ డాక్టర్ గుఫ్రాన్ బేగ్ చెప్పారు. శుక్రవారం కూడా ఇలాగే ఉండే అవకాశాలున్నాయని బేగ్ అన్నారు.

Next Story

Most Viewed