పాన్‌కార్డ్ అప్‌డేట్ అంటూ SMS.. క్లిక్ చేస్తే బ్యాంకు అకౌంట్ ఖాళీ

by  |
పాన్‌కార్డ్ అప్‌డేట్ అంటూ SMS.. క్లిక్ చేస్తే బ్యాంకు అకౌంట్ ఖాళీ
X

దిశ, వెబ్‌డెస్క్: రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఇటువంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆన్ లైన్‌లో షాపింగ్ చేసి కొందరు డబ్బులు పోగొట్టుకుంటే, ప్రీ కూపన్లంటూ మోసపోయే వారు మరి కొందరు. అయితే ఇంటర్నెట్ మోసగాళ్లు కూడా రోజుకో రూపం దాల్చుకుంటూ కొత్త పద్ధతులలో సైబర్ నేరాలకు పాల్పడుతూనే ఉంటారు. తాజాగా కూకట్‌పల్లిలోని హెచ్‌ఏఎల్ టౌన్‌షిప్​లోని‌ ఏ–712లో నివాసం ఉంటున్న ఈశ్వర్‌రావు రూ. 52 వేలు పోగొట్టుకున్నాడు. బ్యాంక్ అకౌంట్‌కు పాన్ కార్డు అప్‌డేట్ చేయండంటూ ఫోన్‌కు (https://bit.ly/3ct8irh) బిట్లీ లింక్‌తో SMS వచ్చింది. ఈ లింక్‌ను క్లిక్ చేయాగానే OTP వచ్చింది. దానిని ఎంటర్ చేయగానే ఈశ్వర్‌రావు ఖాతా నుంచి రూపాయలు 52,530 డెబిట్ అయినట్టు SMS వచ్చింది. దీంతో తాను మోసపోయినట్టు ఈశ్వర్ రావు గుర్తించాడు. బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వహీదుద్దిన్ తెలిపారు.

Next Story

Most Viewed