నకిలీ మెయిల్‌తో భారీ మోసం.. గుడ్డిగా నమ్మిన నిమ్రా

by  |
Cyber criminals
X

దిశ, వెబ్‌డెస్క్ : సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ నుంచి అర కోటి రూపాయలకు పైగా కొట్టేసింది. నకిలీ మెయిల్‌ను సృష్టించి ఈ మోసానికి పాల్పడింది. మాసాబ్ ట్యాంక్‌కు చెందిన నిమ్రా సెర్ గ్లాస్ టెక్నాలజీ సంస్థ ఎండీ ఖాదర్.. తన సంస్థకు సంబంధించిన మెటీరియల్ కోసం ఓ ఇంటర్నేషనల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. సదరు సంస్థకు అడ్వాన్స్‌ను డాలర్ల రూపంలో ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేశారు.

అయితే ఖాదర్‌ను ట్రాప్ చేసిన సైబర్ నేరగాళ్లు.. నిమ్రా సెర్ గ్లాస్ టెక్నాలజీ సంస్థ ఒప్పందం చేసుకున్న విదేశీ కంపెనీ నుంచి చేస్తున్నట్లు ఎండీ ఖాదర్‌కు మరో మెయిల్ చేశారు. రెండవ విడత పేమెంట్‌‌లో భాగంగా మరో రూ.55 లక్షలు చెల్లించాలని కోరారు. డబ్బులను తన కంపెనీకి చెందిన లండన్‌లో ఉన్న వేరే బ్యాంకు ఖాతాకు పంపించాలని స్పూఫ్ ఈ మెయిల్‌లో కోరారు. అది నిజమేనని నమ్మిన ఖాదర్ కంపెనీ రూ.53 లక్షల 23వేలు ట్రాన్స్ ఫర్ చేసింది.

కాగా, నిమ్రా సెర్ గ్లాస్ టెక్నాలజీ సంస్థ ఒప్పందం చేసుకున్న అసలైన సంస్థ ఖాదర్‌కు ఫోన్ చేసి డబ్బులు అడగడంతో సైబర్ నేరం బయటపడింది. దీంతో మోసపోయనని గ్రహించిన ఖాదర్.. శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.



Next Story

Most Viewed