కరెంట్ అఫైర్స్: రాష్ట్రాలు

by Disha Web Desk 17 |
కరెంట్ అఫైర్స్: రాష్ట్రాలు
X

గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో ప్రముఖ కథానాయకుడు చిరంజీవికి ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ - 2022 పురస్కారానికి చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్ట కమిటీ ప్రకటించింది.


నాలుగు దశాబ్దాలుగా నటుడిగా 150కిపైగా సినిమాలు చేసి ప్రజాదరణ పొందారని, ఆయనది విశిష్టమైన కెరీర్ అని అభినందిస్తూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. గతంలో ఈ అవార్డుని అమితాబ్ బచ్చన్, హేమమాలిని, రజినీకాంత్, ఇళయరాజా వంటి హేమా హేమీలు ఈ పురస్కారం అందుకున్నారు.

ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ: తెలంగాణలో ఉత్పత్తవుతున్న విత్తనాలు దేశంలోని 16 రాష్ట్రాలకే కాక, పలు దేశాలకు ఎగుమతి అవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ ఎదుగుతోందన్నారు. రాజేంద్రనగర్‌లోని తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రంలో నవంబర్ 25 వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి విత్తన పరీక్షల సదస్సును మంత్రి ప్రారంభించారు.


READ MORE

current affairs: జాతీయం


Next Story

Most Viewed