- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన సీఎస్
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. సమీర్ శర్మ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర ఆదేశాల మేరకు సమీర్ శర్మ 2022 మే 31 వరకు చీఫ్ సెక్రటరీగా కొనసాగనున్నారు. ఇకపోతే సమీర్‌శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం నవంబర్ 2న కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి పై స్పందించిన కేంద్రం పొడిగింపు ప్రతిపాదనను ఆమోదిస్తూ సంబంధిత ఉత్తర్వులను కేంద్రం జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎస్ సమీర్ శర్మ ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story