నకిలీ ఆర్ఎంపీ డాక్టర్ అరెస్ట్

by Disha Web Desk 23 |
నకిలీ ఆర్ఎంపీ డాక్టర్ అరెస్ట్
X

దిశ,తాండూరు : తాండూరు పట్టణంలో నకిలీ ఆర్ఎంపీ డాక్టర్ గా ప్రజలను మోసం చేస్తున్న మహమ్మద్ అంజు ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. ఓ మహిళాను అసభ్యంగా ప్రవర్తించి బెదిరించి సెక్స్ చేసి వీడియో తీసి సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. ఈ నెల 11న ఓ మహిళా ఇచ్చిన ఫిర్యాదు మేరకు నకిలీ ఆర్ఎంపీ డాక్టర్ పై నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో భాగంగా శుక్రవారం నాడు ఆ నేరస్థుడు అహ్మద్ అలియాస్ అంజు ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అహ్మద్ అలియాస్ అంజు వయస్సు 46 తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన నేరస్తుడు గత కొద్దిరోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించు తిరుగుతున్నాడని చెప్పారు. దీంతో తాండూర్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా మహబూబ్నగర్ జిల్లా ఉద్దండాపూర్ లో నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు . నేరస్తుడికి ఆర్ఎంపీ సర్టిఫికెట్ కానీ, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కానీ లేకుండానే రోగులకు తెలిసి తెలియని వైద్యం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించామని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


Next Story