ఉదయం తహశీల్దార్‌గా బాధ్యతలు.. రాత్రి ల్యాండ్ మాఫియా చేతిలో దారుణ హత్య..!

by Mahesh |
ఉదయం తహశీల్దార్‌గా బాధ్యతలు..  రాత్రి ల్యాండ్ మాఫియా చేతిలో దారుణ హత్య..!
X

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా బొండపల్లి తహశీల్దార్ దారుణం చోటు చేసుకుంది. నిన్ననే బొండపల్లి తహశీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్న ఆయన సాయంత్రం కొమ్మాదిలోని తన ఇంటికి చేరుకున్నాడు. అనంతరం రాత్రి ఆయనను దుండగులు దారుణంగా హత్య చేశారు. తహశీల్దార్ రమణయ్య కుటుంభ సభ్యులు మాత్రం తహశీల్దార్‌ను లాండ్ మాఫీయానే హత్య చేసిందని ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఘటనతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆధారాల సేకరణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed