- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
బైక్‌ను ఢీకొట్టిన టెంపో వాహనం.. ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

దిశ, డైనమిక్ బ్యూరో : ద్విచక్రవాహనాన్ని టెంపో ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం వద్ద జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇమ్మిడిశెట్టి అజయ్ తేజ(19), సూర్య కుమార్(19)లు సెంటెన్స్ కళాశాలలో డిప్లొమా చదువుతున్నారు. అయితే అజయ్ తేజ బాపట్లకు చెందిన వాడు కాగా సూర్యకుమార్ దేశాయిపేటకు చెందిన యువకుడు. వీరిద్దరు మంగళవారం ఉదయం బైక్ పై కాలేజీకి వెళ్తుండగా కోళ్లతో వెళ్తున్న టెంపో వీరిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న చీరాల వైసీపీ ఇన్‌చార్జి కరణం వెంకటేశ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 108కు ఫోన్ చేసి చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టెంపో నడపుతున్న డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నారని, అందువల్లే ప్రమాదం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.