తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య..?

by Disha Web Desk 11 |
తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య..?
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: తల్లి మందలించిందని మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్నమ్మ, రాములు దంపతుల కూతురు దీపిక (17), గ్రామంలోని ఓ యువకుడితో చనువుగా ఉంటుందని తల్లి మందలించడంతో మనస్థాపం చెంది ఉండొచ్చని, అందుకే క్షణికావేశంలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే ఇంట్లోకి వెళ్లి తలుపులకు గొళ్లెం పెట్టుకొని ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతిరాలి బంధువులు తెలిపారు.


👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story

Most Viewed