- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
ఆటాడుకుంటుండగా చీర మెడకు చుట్టుకొని చిన్నారి మృతి
by Disha Web |

X
దిశ, సికింద్రాబాద్ : చీరతో ఆడుకుంటున్న బాలికకు ప్రమాద శాత్తు ఆ చీర మెడకు చుట్టుకొని ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందిన ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. లాలాపేటకు చెందిన రాజేష్ కుమార్తె కోట ఎలీనా ( 9 ) తల్లిదండ్రులు శనివారం పనికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఎలీనా తన చెల్లెలితో కలిసి ఇంట్లో ఆడుకుంటుంది. ఈ క్రమంలో మెడకు చీర కట్టుకొని గోడకు ఉన్న మేకుకు కట్టుకుంది. అది ఒక్కసారిగా గొంతుకు బిగుసుకుపోవడంతో ఊపిరాడక ఉక్కురిబిక్కిరై చనిపోయింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు ఇంటికి చేరుకునేలోగా అప్పటికే ఎలీనా మృతి చెందింది. సమాచారం అందుకున్న లాలాగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story