ఆరు లీటర్ల గుడుంబా పట్టివేత

by Disha Web Desk 1 |
ఆరు లీటర్ల గుడుంబా పట్టివేత
X

తిరుమలాపూర్ శివారులో ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడి

దిశ, రామడుగు : కరీంనగర్ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి, డీపీఈవో శ్రీనివాసరావు, ఏఈఎస్ మణెమ్మ ఆదేశాల మేరకు బుధవారం రామడుగు మండలంలోని తిరుమలాపూర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి వద్ద నుంచి ఆరు లీటర్ల నాటు సారా, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్ తెలిపారు.వివరాల్లోకి వెళితే.. జగిత్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఎల్లాపూర్ తండా నుంచి తిరుమలాపూర్ కు చెందిన కొంతమంది వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై నాటు రవాణా తరలిస్తున్నారనే ఖచ్ఛితమైన సమాచారం మేరకు బుధవారం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సీఐ చంద్రమోహన్, ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూట్ వాచ్ నిర్వహించారు.

ఈ క్రమంలో ఎల్లాపూర్ తాండ నుంచి నాటుసారా తెచ్చుకుంటున్న చంద్రయ్య అనే వ్యక్తి వద్ద నుంచి ఆరు లీటర్ల నాటు సారా, ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకొని అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. ఈ నాటు సారా తయారు చేసిన ఎల్లాపూర్ తాండకు చెందిన వ్యక్తి వివరాలు తెలుసుకొని అతడిపై కూడా కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. ఎవరైనా అక్రమంగా నాటు సారా అమ్మినా, కొనుగోలు చేసినా.. వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఎవరైనా ఎక్సైజ్ నేరాలలో పట్టుపడితే వారిని స్థానిక ఎమ్మార్వో ఎదుట బైండోవర్ చేస్తామన్నారు. తిరిగి అదే ఎక్సైజ్ నేరంలో వారు పట్టుబడితే వారికి 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించబడుతుందని సీఐ హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ మోసిన్, కమలాకర్, కుమార్ యాదవ్, కమాలుద్దీన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed