చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

by Shiva |
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
X

దిశ చేగుంట : రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్ కథనం మేరకు.. మాసాయిపేట మండల పరిధిలోని చెట్ల తిమ్మాయపల్లి పులిగుట్టతండాకు చెందిన బానోతు రాజు (45) ఈనెల 14న ఆదివారం మధ్యాహ్నం తన బైక్ పై మాసాయిపేటకు పనిపై వెళ్లాడు. కొద్ది దూరం వెళ్లిన తరువాత దత్తాద్రి వ్యవసాయ పొలం వద్ద రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో రాజు తలకు, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి.

అనంతరం అతడిని తిమ్మాయపల్లి ఆర్.ఎం.పి వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మల్లారెడ్డి హాస్పిటల్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాజు మంగళవారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు చందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపారు.

Advertisement

Next Story