ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు.. ముగ్గురు అరెస్ట్

by Disha Web Desk 11 |
ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు.. ముగ్గురు అరెస్ట్
X

దిశ, మల్కాజిగిరి: రాచకొండ పోలీసులు ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల నేపథ్యంలో ఒక ముఠా ఆన్ లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు, చైతన్యపురి పోలీసుల సహకారంతో మొత్తం ఆరుగురు సభ్యుల ముఠా గుట్టు రట్టు చేశారు. వీరిలో ముగ్గురిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీరో ఉన్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. శనివారం నేరేడ్ మెట్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

ముఠా సభ్యుల నుంచి రూ. 20 లక్షల నగదు, 7 సెల్ ఫోన్లతో పాటు ఆయా వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోని లావాదేవిల్లోని మొత్తం రూ.1,42,07,573 సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుల్లో బండ్లగూడ నాగోల్ కు చెందిన ఏడుకుల్ల జగదీష్ (43), వసస్థలిపురంకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జక్కిరెడ్డి అశోక్ రెడ్డి (47), కూకట్ పల్లికి చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగి వొడుపు చరణ్ (38)లను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్నవారిలో ఎపీకి చెందిన పలాస శ్రీనివాస్ రావు, సురేష్ మైలాబత్తుల కాగా ప్రధాన నిందితుడు హర్యానా రాష్ట్రానికి చెందిన విపుల్ మోంగాగా పోలీసులు గుర్తించారు.

జగదీష్ క్రికెట్ బెట్టింగ్‌లను నిర్వహించడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోన్న జక్కిరెడ్డి అశోక్ రెడ్డి బెట్టింగ్‌లకు బానిసై కోట్ల రూపాయలు కోల్పోయాడు. ‘నేషనల్ ఎక్స్ఛేంజ్ 9’ ద్వారా ఆన్ లైన్ లో బెట్టింగ్ రాకెట్‌ నిర్వహిస్తున్నారు. యూజర్ ఐడీలు, పాస్వర్డ్ లతో బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి నిందితులు పంటర్ల నుంచి భారీ బెట్టింగ్ మొత్తాలను వసూలు చేస్తున్నారు. సుమారు మూడు కోట్ల రూపాయల బెట్టింగ్ లు జరిపినట్లు తెలిపారు. బెట్టింగ్ ముఠాను పట్టుకున్న సిబ్బందిని సీపీ డీఎస్ చౌహాన్ అభినందించారు.

Next Story

Most Viewed