కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి ఓటమి భయం : బండి సంజయ్

by Disha Web Desk 23 |
కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి  ఓటమి భయం :  బండి సంజయ్
X

దిశ,కరీంనగర్ టౌన్ : పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కి ఓటమి భయం పట్టుకుందని, కావాలని బీజేపీ పై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. బుధవారం కమాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో కేంద్ర మంత్రి మురుగన్ తో కలిసి ప్రసంగించారు. రిజర్వేషన్ల రద్దు కోసమే 2000 సంవత్సరంలో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ ను బీజేపీ ప్రభుత్వం నియమించిందని, ఆయనిచ్చిన రిపోర్టును కూడా తొక్కి పెట్టారని చెబుతున్న రేవంత్ రెడ్డి… 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే కదా.. మరి ఆ రిపోర్టును ఎందుకు బయట పెట్టలేదు? గాడిద పళ్లు తోముకుంటూ కూర్చున్నారా?’’ అని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే రిజర్వేషన్ల ప్రక్రియను తెరపైకి తీసుకు వచ్చిందని కాంగ్రెస్ పై మండిపడ్డారు.

10 ఏళ్లు అధికారంలో ఉన్నా కరీంనగర్ ప్రజలకు వినోద్ కుమార్ చేసిందేమీ లేదని, కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టడం, దాచుకోవడం తప్ప అని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ నిధులతో కెసిఆర్ సోకులు పడ్డాడని, కేంద్ర నిధులను తప్పుదోవ పట్టించిన బిఆర్ఎస్ నాయకులను, అధికారులను ఎదిరించి వారం రోజుల్లో కరీంనగర్ కు నిధులు తీసుకొచ్చానని అన్నారు. కరీంనగర్ ఎల్కతుర్తి హైవేకు 2000 కోట్ల నిధులు మంజూరు చేయించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చే ప్రారంభించామని, ఎల్కతుర్తి నుండి సిద్దిపేటకు 500 కోట్లతో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టామని పేర్కొన్నారు. దేశంలో పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే బిజెపితోనే సాధ్యమవుతుందన్నారు.

దళిత, గిరిజన, బీసీలు, అగ్రకుల పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్న ప్రభుత్వం మోదీదే అన్నారు.. రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఆలోచనే బీజేపీకి లేదని,అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు అట్టడుగునున్న పేదలకు చెందాలన్నదే బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమణి,మోదీ ప్రభుత్వం ఆ సిద్ధాంతాలను తూ.చ తప్పకుండా అమలు చేస్తారు అన్నారు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి సీఎం కుర్చీకి పెసరపెట్టి ఢిల్లీకి పోయి బడా నేతలతో మీటింగులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ పై తప్పుడు ప్రచారం చేసిన, మాట్లాడిన లీగల్ చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. కరీంనగర్ ప్రజలందరూ ఓటు వేసి నన్ను గెలిపిస్తే, నేను మోడీకి ఓటు వేసి గెలిపిస్తానని అన్నారు. దేశ అభివృద్ధి దేశ భద్రత కోసమే ఈ ఎన్నికలు, ప్రజలందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రమేష్, చొప్పరి జయశ్రీ, క్రిష్ణ, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story