ఐపీఎల్ బెట్టింగ్ ముఠా ఆటకట్టు..

by Disha Web Desk 20 |
ఐపీఎల్ బెట్టింగ్ ముఠా ఆటకట్టు..
X

దిశ, నల్లగొండ : ఐపీఎల్ సీజన్ లో మిర్యాలగూడలో బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితులను అరెస్ట్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడలో వన్ టౌన్ పరిధిలోని మయూరినగర్ హౌసింగ్ బోర్డులోని సాయి దత్త అపార్ట్మెంట్ లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు విశ్వనీయ సమాచారం అందింది. దీంతో టాస్క్ఫోర్స్, స్పెషల్ టీం పోలీసు సిబ్బంది సంయుక్తంగా అపార్ట్మెంట్ లోకి వెళ్లి ఆన్లైన్ ఐపీల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న తొమ్మిది మంది వ్యక్తులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక కోటి పన్నెండు లక్షల రూపాయల నగదు, రెండు కార్లు సుమారు ముపై లక్షలు, మూడు లక్షల విలువైనవి పద్నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులలో ఈ క్రికెట్ బెట్టింగ్ ప్రధాన నిందితుడు బంటు రాజేష్ కుమార్ గత మూడు సంవత్సరాలుగా బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇతను టెలిగ్రామ్ అనే యాప్ ద్వారా ఈ తతంగం నడిపిస్తున్నట్లు తెలిపింది. మిగిలిన ఎనిమిది మంది నిందితులు ఆన్లైన్ కమిషన్ ద్వారా బెట్టింగులకు పాల్పడే వారి నుండి ఆన్లైన్ అలాగే ఆఫ్ లైన్ ద్వారా కూడా బెట్టింగులు నిర్వహించే వారు అని సులువుగా డబ్బు సంపాదించడం సాధ్యం అవుతుందని అని చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలుచేశారన్నారు. నిందితులు బంటు రాజేష్, కొల సాయి కుమార్, రాచబంతి జీవన్ కుమార్, నోట్ల సత్యనారాయణ, శాఖమురి ఉదయ్ కుమార్, బంటు సంతోష్, గంధం నవీన్ కుమార్, బంటు వంశీ కృష్ణ, కొండవేటి రాజేష్ లను అదుపులోకి తీసుకొని కేసునమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. గతంలో కూడా రాజేష్ మీద సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో క్రికెట్ బెట్టింగ్ మీద కేసునమోదు అయినట్లు తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట రీత్యా కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కేసును డీఎస్పీ వెంకటగిరి పర్యవేక్షణలో మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ.రాఘవేందర్, ఎస్సై.శివ తేజ, ఎస్సై కట్టంగూర్ విజయ్ కుమార్, మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సై.వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ ఘఫర్, కానిస్టేబుల్ రవి, హాలియ పీఎస్ రహిమాన్, జి.వీరబాబు, ఎస్. వెంకటేశ్వర్లు, ఎం. సైదులు పాల్గొన్నారు.

Next Story