అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్..

by Disha Web Desk 13 |
అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్..
X

దిశ, మరిపెడ: మరిపెడ మండల కేంద్రంలో నిషేధిత గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నట్లు తొర్రూరు డీఎస్పీ ఏ. రఘు మీడియా సమావేశంలో వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాలతో గంజాయి నిర్మూలనకు "మనలో మార్పు" అనే సామాజిక సాంస్కృతిక కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, గంజాయి, నల్ల బెల్లం, గుడుంబా అక్రమ వ్యవహారాల పై ప్రత్యేక నిఘా ఉంచి నిర్మూలనకు కృషి చేస్తున్నామని అన్నారు.

ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లా నుండి మహారాష్ట్రకు అక్రమ రవాణా చేస్తున్న క్రమంలో మరిపెడ మండల కేంద్రంలోని ఆర్జేయంఆర్ ప్రైవేటు డిగ్రీ కళాశాల వద్ద మాటు వేసి కారులో నుంచి బొలెరో వెహికల్ లోకి గంజాయి మారుస్తూ ఉండగా దాడి చేశారు. అనంతరం అనుమానాస్పదంగా కనిపించినా ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 7.50 లక్షల రూపాయల విలువైన 50 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రెండు కార్లు ఒక బొలెరో వాహనం సీజ్ చేశారు. మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే పట్టుకుని జైలుకు పంపుతామన్నారు.

ఈ కేసులో ఉన్న పాత నేరస్తుడి పై గతంలోని ఎనిమిది కేసులు నమోదు అయి ఉన్నాయని అతనిపై గతంలో రెండు సార్లు పీడీ యాక్ట్ నమోదు చేసిన ప్రయోజనం లేదని ప్రవర్తన మార్చుకోలేదని అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేసి కఠినంగా శిక్షిస్తామని అలాగే రవాణాను విజయవంతంగా అడ్డుకొని నేరస్తులను అదుపులోకి తీసుకోవడం లో కృషి చేసిన మరిపెడ సీఐ సాగర్, ఎస్సై దూలం పవన్ కుమార్, ఎస్సై జాన్సీ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మరిపెడ సీఐ సాగర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed