అక్రమంగా తరలించిన హాస్టల్ బియ్యం పట్టివేత

by Disha Web |
అక్రమంగా తరలించిన హాస్టల్ బియ్యం పట్టివేత
X

దిశ, జన్నారం : గిరిజన సంక్షేమ వసతి గృహాలకు చెందిన బియ్యాన్ని మండల కేంద్రంలోని జీసీసీ గోదాం వద్ద టీఎస్ ఓ1 యూసీసీ 5003 నెంబర్ గల ప్రభుత్వ వాహనంలో బుధవారం తరలించి డంపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఆదివాసి సంఘాలకు చెందిన నాయకులు రాజకుమార్, రాజేశ్వర్లు పట్టుకున్నారు. అనంతరం రెవెన్యూ పోలీస్ అధికారులకు సమాచారం అందించారు.

వెంటనే ఆర్ఐ భానుచందర్ వచ్చి వ్యాన్ లో ఉన్న 20 బస్తాల బియ్యంతో పాటు విద్యార్థులకు ఉపయోగించే టూత్ పేస్టులు, దువ్వెనలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మంచిర్యాల జిల్లా దేవాపూర్ నుండి అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారని ఇందులో ప్రమేయం ఉన్న ఆఫీసర్ల పై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.


Next Story