మంత్రి బందోబస్తుకు వచ్చి అడవిలో శవమై తేలిన హోంగార్డ్.. అసలేం జరిగిందంటే?

by Disha Web Desk 19 |
మంత్రి బందోబస్తుకు వచ్చి అడవిలో శవమై తేలిన హోంగార్డ్.. అసలేం జరిగిందంటే?
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో మంగళవారం మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించిన విషయం తెలిసిందే. మంత్రి పర్యటన సందర్భంగా ఈగలపెంట పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు వెంకటేష్ బందోబస్తుకు వచ్చారు. అయితే మంత్రి బందోబస్తుకు వచ్చిన వెంకటేష్ మంగళవారం గల్లంతయ్యారు. దీంతో పోలీసులు గత రెండు రోజులుగా సీసీ పుటేజీ ద్వారా గాలింపు చేపట్టగా.. ఉమామహేశ్వరం వెళ్లే రహదారిలోని ఉసిల్ల బండ కుంట వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఇవాళ హోంగార్డ్ వెంకటేష్ మృతదేహాన్ని గుర్తించారు.

కరెంట్ వైర్‌తో చెట్టుకు ఉరి వేసుకుని వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు నిర్థారించారు. హోంగార్డ్ వెంకటేష్ మంగళవారం బందోబస్తు నిర్వహించిన ప్రదేశము నుండి ఉమామహేశ్వర రహదారి వెంట వెళ్లి ఉసిల్లబండ కుంటలో ఓ బోరుమోటర్‌కు ఉన్న కరెంటు వైర్‌ను తీసుకుని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. కాగా, మృతుడు వెంకటేష్‌కు భార్య జ్యోతి, కుమారుడు రుషి వర్మ, కూతురు తేజశ్రీ ఉన్నారు. వెంకటేష్ మృతి చెందాడని తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.


Next Story

Most Viewed