ఈ ఆరేళ్లలో 813 మంది ఎన్కౌంటర్..!

by Dishafeatures2 |
ఈ ఆరేళ్లలో 813 మంది ఎన్కౌంటర్..!
X

దిశ, వెబ్ డెస్క్: 2016-17 నుంచి 2021-22 వరకు దేశంలో మొత్తం 813 మంది ఎన్కౌంటర్ అయ్యారు. యూపీకి చెందిన గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే నుంచి హైదరాబాద్ లో జరిగిన దిశ మర్డర్ నిందితుల వరకు చాలా మంది ఈ ఆరేళ్ల కాలంలో ఎన్కౌంటర్ చేయబడ్డారు. ఇక ఈ ఆరేళ్లకాలంలో జరిగిన ఎన్కౌంటర్లలో ప్రధానమైన ఎన్కౌంటర్లు ఇవే..

1.గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్

ఉత్తరప్రదేశ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే 8 మంది కాన్పూర్ పోలీసులను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ క్రమంలోనే 2020 కాన్పూర్ పోలీసులు అతడిని ఉజ్జయినిలో పట్టుకొని కాన్పూర్ కు తీసుకెళ్తున్నారు. అయితే వారు ప్రయాణిస్తున్న వాహనం వేగంగా వెళ్తున్న క్రమంలో వికాస్ దుబే పోలీసుల నుంచి తుపాకీ లాక్కొని వాహనం నుంచి బయటకు దిగాడు. పోలీసుల వైపు కాలుస్తూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలోనే జరిగిన ఎదురుకాల్పుల్లో వికాస్ దుబే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

2. సిమికి చెందిన ఖైదీల ఎన్కౌంటర్

ఉగ్రవాద కేసుల్లో శిక్ష పడి భోపాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మంది సిమి టెర్రరిస్టులు భోపాల్ జైలు నుంచి పారిపోయారు. అయితే వారు జైలు నుంచి పారిపోయిన 10 గంటల్లోనే పోలీసులు వాళ్ల ఆచూకీని కనుగొన్నారు. ఈ క్రమంలోనే వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా.. నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారు. అయితే పోలీసులు కూడా ఫైరింగ్ ఓపెన్ చేయడంతో ఎనిమిది మంది టెర్రరిస్టులు చనిపోయారు. 2016 అక్టోబర్ 31న ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.

3. దిశ నిందితుల ఎన్కౌంటర్

2019 నవంబర్ లో దిశ అనే ఓ వెటర్నరీ డాక్టర్ ను నలుగురు వ్యక్తులు అత్యంత పాశవికంగా లైంగకదాడి జరిపి.. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటన దేశవ్యాపంగా సంచలనంగా మారింది. కాగా ఈ ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసమని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అయితే ఈ క్రమంలోనే నిందితులు పోలీసులపై తిరగబడి తుపాకులు లాక్కునేందుకు ప్రయత్నించారు. అనంతరం పోలీసులపై కాల్పులు జరిపారు. నిందితుల నుంచి తప్పించుకోవడానికి పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆ నలుగురు నిందితులు చనిపోయారు. అయితే తమ వాళ్లను పట్టుకొని చంపేసి ఎన్కౌంటర్ అంటూ కథ అల్లారని నిందితుల కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఈ ఎన్కౌంటర్లలో యూపీ అగ్రస్థానం దక్కించుకుంది. 2017 మార్చి నుంచి 2022 వరకు ఒక్క యూపీలోనే 178 ఎన్ కౌంటర్లు జరిగాయి.

Next Story

Most Viewed