కావేరి నదిలో మునిగి నలుగురు కాలేజీ విద్యార్థులు మృతి..

by Disha Web Desk 9 |
కావేరి నదిలో మునిగి నలుగురు కాలేజీ విద్యార్థులు మృతి..
X

దిశ, వెబ్‌డెస్క్: 20 ఏళ్ల నలుగురు యువకులు కావేరి నదిలో మునిగి మృతి చెందిన ఘోరమైన ఘటన తమిళనాడులోని సంగకరగిరి మండలం కల్వదంగం గ్రామం వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మృతులు ఎం.మణికందన్ (20), ఎం.సెల్వం (20), మణికందన్ (20), పాండ్యరాజన్ (20). వీరు సేలంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నారు. ఆ కాలేజ్‌లోని 15 మంది విద్యార్థులు స్నానం చేసేందుకు గురువారం మధ్యాహ్నం ఒంటిగంట వేళ, సమీపంలో ఉన్న కావేరి నది వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి నదిలోకి దిగి చిక్కుకుపోవడంతో.. అతడ్ని రక్షించేందుకు ముగ్గురు స్నేహితులు ప్రయత్నించారు. ఆ సమయంలోనే నీటి ప్రవాహం వేగం పెరిగింది.

ఈత రాకపోవడంతో.. వారు కూడా నదిలోనే మునిగిపోయారు. ఈ ఘటనపై తోటి విద్యార్థులు గ్రామీకులకు, పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వెంటనే ఘటన చోటుకి తరలివచ్చారు. అధికారులు మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి పంపించారు. ఈ విషాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు సహాయం అందించారు. అలాగే విద్యార్థులు విహారయాత్రలకు వెళ్లిన సమయంలో చాలా జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కోరారు.


Next Story