ఇందుప్రియల్ లో బాల్య వివాహం

by Disha Web Desk 1 |
ఇందుప్రియల్ లో బాల్య వివాహం
X

తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన బాలల సంరక్షణ విభాగం అధికారులు

దిశ దౌల్తాబాద్ : బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని బాలల సంరక్షణ అధికారి చంద్రకళ అన్నారు. మండల పరిధిలోని ఇంద్రప్రియల్ గ్రామంలో ఆదివారం బాల్య వివాహం జరిగిందని 1089 నెంబర్ కు సమాచారం అందింది. దీంతో సోమవారం ఘటనా స్థలానికి బాలల సంరక్షణ అధికార యంత్రాంగం సోమవారం గ్రామానికి చేరుకొని తుప్పతి రాజమణి, రాజు దంపతుల కూతురు శిరీషకు, గజ్వేల్ మండల పరిధిలోని పిలిచేడి గ్రామానికి చెందిన రవి అనే యువకునికి బాల్య వివాహం జరిపించారని తెలిపారు.

వివాహాలు జరగడం వల్ల జరిగే అనర్థాల గురించి వివరించామని తెలిపారు. శిరీష తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుని పదో తరగతికి వెళ్లే పాపకు పెళ్లి చేయడం సరికాదని తల్లిదండ్రులకు సూచించారు. నిరుపేద కుటుంబాల తల్లిదండ్రులకు పోషించే శక్తి లేని పక్షంలో ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో చేర్పిచాలని గుర్తు చేశారు. చిన్నతనంలో వివాహాం చేయడం వల్ల పెళ్లి చేసుకున్న అమ్మాయిలు శరీర ఎదుగుదల తగ్గిపోతుందని అన్నారు. అదే విధంగా పుట్టబోయే బిడ్డ బలహీలుగా పుడతారని, అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు.

అందుకోసం ప్రభుత్వం సూచించిన విధంగా అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్ల వయసుకు రాగానే వివాహం జరిపించాలన్నారు. లేనిపక్షంలో పెళ్లి చేసిన ఇరు వర్గాల తల్లిదండ్రులకు బాల్య వివాహ చట్టం ద్వారా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆదివారం వివాహం జరిగిన శిరీషకు 18 ఏళ్లు నిండే వరకు బాలల సంరక్షణ ఆవరణలోనే ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందుప్రియల్ ఐసీడీఎస్ సూపర్ వైజర్ గిరిజ, బాలల పరిరక్షణ విభాగం ఎల్సీపీవో శరత్ బాబు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed