మామూళ్ల మత్తులో ఇంటర్మీడియట్ విద్యాధికారులు..

by Disha Web Desk 20 |
మామూళ్ల మత్తులో ఇంటర్మీడియట్ విద్యాధికారులు..
X

దిశ, రంగారెడ్డి బ్యూరో, గండిపేట్ : రంగారెడ్డి జిల్లా నారాయణ శ్రీ చైతన్య గాయత్రి పేర్లతో అడవి ప్రాంతంలో కార్పొరేట్ కళాశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మంచి కార్పొరేట్ విద్యను పిల్లలకు అందించాలని లక్ష్యం తప్ప మరొక ధ్యాస లేకుండా కాలేజీలలో చేర్పిస్తున్నారు. దీంతో ఆ విద్యార్థులు మానసిక పరిస్థితి గానీ ఆసక్తి అనాసక్తి పై దృష్టి కేంద్రీకరించకుండా కేవలం కార్పొరేట్ కాలేజీలకే పిల్లల తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఆ కళాశాల యజమాన్యం ప్రిన్సిపల్ లెక్చరర్లు మానసిక ఒత్తిడిని విద్యార్థులు తల్లిదండ్రులు గమనించకపోవడం గమనర్హం.

అయితే విద్యార్థులు ఆవేదనను తల్లిదండ్రులకు చెప్పి ప్రయత్నం చేయాలనుకున్న సాకుగా చూసి అటువంటి పరిస్థితిని ప్రస్తుత సమాజంలో కల్పించారు. ఏది ఏమైనాప్పటికి రంగారెడ్డి జిల్లా పరిధిలోని అనేక కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను చదువు పేరుతో విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. శ్రీ చైతన్య నారాయణ గాయత్రి లాంటి కార్పొరేట్ కళాశాలలు ఊరికి దూరంగా రవాణా సౌకర్యం విలువలేనటువంటి ప్రాంతాలలో బ్రాంచీల పేరుతో కాలేజీలు ఏర్పాటు చేసి విద్యార్థుల ఉసురు తీసుకుంటున్నారు. ఈ కార్పొరేట్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం దాసోహంగా మారింది. జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యాధికారులు వసూల్లకు అలవాటు పడి సరైన తనిఖీలు చేయడంలో విఫలమవుతున్నారు. దీంతో ఆ కాలేజీలో ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది.

మానసిక ఉల్లాసానికి చర్యలేవి...?

విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పిల్లవాడికి సామాజిక మానసిక అంశాలపై శిక్షణ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాథమిక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఇంటర్మీడియట్ విద్యాధికారులు పరీక్షల పరిశీలనకే పరిమితమయ్యారు. అయితే ఒక కాలేజీలో ఒక సెక్షన్ లో ఉండవలసిన విద్యార్థుల సంఖ్య కంటే అధికంగా సంఖ్య ఉన్నప్పుడు చర్యలు తీసుకోవాలి అంతే కాకుండా బ్రాంచీల పేరుతో నడిపించే కాలేజీలపై వేటు ఎందుకు వేయడం లేదు చదువులో భాగమైన క్రీడా విభాగం పై దృష్టి ఎందుకు పెట్టడం లేదు. వీటి అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో విద్యా సంస్థల పనితీరు ప్రతిక్షణం పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జరుగుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలలో ఆటల విభాగం పూర్తిగా నిషేధించారు. ఇదే కాకుండా ప్రయోగాత్మకమయినటువంటి చదువులను బోధించాల్సిన విద్యను పూర్తిగా విద్యార్థులకు దూరం చేసిన దుస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కేవలం నాలుగు గోడల మధ్య విద్యార్థిని బందీ చేసి విద్యను అభ్యసిస్తున్న దుస్థితి చేర్చింది. ఇందులో భాగంగానే నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ చైతన్య కాలేజ్ లో ఆ యజమాన్యం పెట్టిన హింసను తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కన్నీరు పెట్టిస్తున్న సాత్విక్ సూసైడ్ లెటర్...

శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా సాత్విక్ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ లెటర్ వెలుగులోకి వచ్చింది. 'అమ్మ' నాన్మ, అన్న మిమ్మల్ని బాధ పెట్టాలని ఈ పనిచేయలేదు, నాకు కాలేజీలో సీనియర్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, ప్రిన్సిపల్ నుండి విపరీతమైన ఒత్తిడి ఉంది. అందుకే ఈ పనిచేస్తున్నా.. క్షమించండి. మిస్ యూ అమ్మ, మిస్ యూ ఫ్రెండ్స్ అని లెటర్లో రాశాడు. ఆత్మహత్యకు ముందే సాత్విక్ రాసిన సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లెటర్లో స్వాతిక్ తన ఆవేదనను వెల్లగక్కిన తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది.


Next Story