తల్లీకూతురు షాపింగ్‌కు.. ఇంట్లో మామ, అల్లుడు కలిసి..

by Disha Web Desk |
తల్లీకూతురు షాపింగ్‌కు.. ఇంట్లో మామ, అల్లుడు కలిసి..
X

దిశ, మెదక్ : మామ, అల్లుడు కలిసి మద్యం సేవించారు. ఇద్దరు కలిసి విందు జోష్‌లో ఉండగా మాట మాట పెరిగింది. అంతే.. ఇద్దరు కలిసి ఒకరినొకరు కొట్టుకున్నారు. అల్లుడిని మామ కర్రతో గట్టిగా కొట్టడంతో తీవ్రగాయాల పాలై మృతి చెందాడు. గురువారం మెదక్ జిల్లాలో జరిగిందీ ఘటన. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. హవేలీ ఘనపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మొగుళ్ల సాయిలు మహారాష్ట్ర లాథుర్‌కు చెందిన నితిన్(35)కు తన కూతురు జ్యోత్స్నకు ఇచ్చి వివాహాం చేశాడు. నితిన్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో వ్యాపారం చేస్తుంటాడు. కొత్తపల్లిలో జరిగిన పస్కల పండగకు నితిన్ తన భార్యతో కలిసి మామ సాయిలు ఇంటికి వచ్చారు.

బుధవారం సాయిలు భార్య, కుమార్తెలు మెదక్‌లో షాపింగ్‌కు వెళ్లగా మామా అల్లుళ్లు కలిసి మద్యం తాగారు. ఈ సమయంలో ఏదో విషయంపై ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీనితో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆగ్రహించిన సాయిలు పెద్ద కర్ర తీసుకొని అల్లుడు నితిన్‌ను బలంగా కొట్టడంతో అతడు నేలకొరిగాడు. గాయాలతో స్పృహ తప్పిన నితిన్‌ను గ్రామ సర్పంచ్ వెంటనే మెదక్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ మురళి కేసు నమోదు చేశారు.Next Story