అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు

by Disha Web |
అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై  కాల్పులు
X

దిశ, పటాన్ చెరు: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. చికాగోలో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ ఎల్ఐజీ కి చెందిన విద్యార్థి గాయపడ్డాడు. కొప్పాల సాయిచరణ్ అనే విద్యార్థి ఎంఎస్ చదువు కోసం ఈ నెల 13న చికాగోకు వెళ్లాడు. చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్న కొప్పాల సాయి చరణ్.. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగిన కాల్పుల్లో సాయిచరణ్ శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. చికాగో నుంచి సాయి చరణ్ స్నేహితులు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సాయి చరణ్ పై చదువుల నిమిత్తం వెళ్లి పది రోజులు కాకముందే ఈ సమాచారం అందడంతో అతని తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. ఈ కాల్పుల్లో సాయి చరణ్ తో పాటు మరొకరికి బుల్లెట్ గాయాలయ్యాయని సమాచారం. కాల్పుల్లో గాయపడ్డ సాయి చరణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అక్కడి వైద్యులు వెల్లడించినట్లుగా తెలుస్తోంది.


Next Story