హైదరాబాద్ లో డీఆర్డీవో శాస్త్రవేత్త ఆత్మహత్య

by Javid Pasha |
హైదరాబాద్ లో డీఆర్డీవో శాస్త్రవేత్త ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: వ్యాపారంలో స్నేహితుడు మోసం చేశాడనే ఆవేదనతో ఓ డీఆర్డీవో శాస్త్రవేత్త ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన వనం రమేశ్ (38) హైదరాబాద్ లోని కంచన్ బాగ్ డీఆర్డీవోలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నాడు. కాగా కొంత కాలం కిందట స్థానికంగా ఉండే ఓ బ్యాంకులో కోటి రూపాయలు అప్పు తీసుకొని స్నేహితునితో కలిసి రమేశ్ వ్యాపారం మొదలు పెట్టాడు. అయితే వ్యాపారంలో స్నేహితుడు మోసం చేశాడనే ఆవేదనకు గురైన రమేశ్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story