వేరే యువతితో పెళ్లికి సిద్ధపడిన ప్రియుడు.. షాక్ ఇచ్చిన ప్రియురాలు

by Rajesh |
వేరే యువతితో పెళ్లికి సిద్ధపడిన ప్రియుడు.. షాక్ ఇచ్చిన ప్రియురాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తనను ప్రేమించి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడిన ప్రియుడిపై యువతి యాసిడ్ తో దాడి చేయడం కలకలం రేపింది. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బానుపురికి చెందిన దమ్రుధర్ బాఘేల్ (25) అనే వ్యక్తి ఓ యువతి ప్రేమించుకున్నారు. వీరి మధ్య మనస్పర్థలు రాగా ప్రియురాలిని బాఘేల్ దూరం పెట్టాడు. ఈ క్రమంలో వేరే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు.

అయితే విషయం తెలుసుకున్న ప్రియురాలు ప్రియుడిని చంపాలని ఫిక్స్ అయింది. పెళ్లి సమయంలో అబ్బాయిలా వేషం మార్చుకుని వచ్చింది. తనతో పాటు తెచ్చుకున్న యాసిడ్ సీసాను అతనిపైకి విసిరింది. దీంతో వధువరులతో పాటు పెళ్లికి వచ్చిన వారంతా షాక్ కు గురయ్యారు. తెరుకునే లోపే యువతి పరారైంది. వధూవరులతో పాటు పది మందికి గాయాలయ్యాయి. పోలీసులు కళ్యాణ మండపంలో సీసీ కెమెరాలు పరిశీలించారు. వచ్చింది అమ్మాయి అని గుర్తించారు. పెళ్లికొడుకు మాజీ ప్రియురాలని తేల్చారు. ఆమెను అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed