ట్రాక్టర్ ట్రాలీ కింద పడి బాలుడు మృతి..

by Sumithra |
ట్రాక్టర్ ట్రాలీ కింద పడి బాలుడు మృతి..
X

దిశ, పెద్దపల్లి టౌన్ : ట్రాక్టర్ ట్రాలీ కింద పడి బాలుడు మృతి చెందిన సంఘటన జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళ్తే బాలసాని జస్వంత్ (09) అనే బాలుడు స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు.

ఆదివారం సెలవు దినం కావడంతో ఈతకు వెళ్లి తిరిగి వస్తూ అటుగా వెళుతున్న ట్రాక్టర్ ని ఆపి దానిపై ఎక్కి ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు అదే ట్రాక్టర్ ట్రాలీ టైర్ల క్రిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి రవీందర్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.

Advertisement

Next Story