8 మంది మోడల్స్‌పై గ్యాంగ్ రేప్.. దేశంలో సంచలనం రేపుతోన్న ఘటన

by Disha Web Desk 19 |
8 మంది మోడల్స్‌పై గ్యాంగ్ రేప్.. దేశంలో సంచలనం రేపుతోన్న ఘటన
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికాలో సంచలన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మ్యూజిక్ షూట్ కోసం వెళ్లిన 8మంది మోడల్స్‌పై దుండగులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్సెస్‌బర్గ్‌కు పశ్చిమాన ఉన్న క్రూగెర్స్‌డార్ప్ అనే పట్టణానికి కొందరు మోడల్స్ ఓ మ్యూజిక్ షూట్ కోసం వెళ్లారు. వీరితో పాటుగా కొందరు సహయక సిబ్బంది సైతం షూటింగ్ జరిగే ప్రాంతానికి వెళ్లారు. అయితే, స్పాట్‌కు వెళ్లగానే ముందుగా వాహనం దిగిన సెట్ వేసే సిబ్బంది.. షూటింగ్ కోసం వచ్చిన మోడల్స్‌ను ఆయుధాలతో బెదిరించారు. అనంతరం 8మంది మోడల్స్‌పై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.

ఈ దుండగులు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే.. ఒకే మహిళపై 10 మంది అత్యాచారం చేయగా.. మరో మహిళపై 8మంది దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో బాధితులంతా 18 నుండి 35 సంవత్సరాల లోపు వారే అని తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సౌతాఫ్రికాలో సంచలనం సృష్టిస్తోంది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని.. ఈ ఘటనలో మొత్తం 20 మందిని నిందితులుగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ ఘటన దేశవ్యాప్తంగా అలజడి రేపడంతో దీనిపై దేశ అధ్యక్షుడు సిరిల్ రమఫోస స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు.


Next Story