మంత్రి మల్లారెడ్డికి జూలకంటి రంగారెడ్డి లేఖ

by  |
మంత్రి మల్లారెడ్డికి జూలకంటి రంగారెడ్డి లేఖ
X

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: ఈఎస్ఐ ఆస్ప‌త్రులు, డిస్పెన్స‌రీల‌లో ప‌నిచేస్తున్న హెడీసీ కార్మికులకు 16 నెల‌లుగా డింగ్‌లో ఉన్న బ‌కాయి వేత‌నాల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని మాజీ ఎమ్మెల్యే జూల‌కంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డిని కోరారు. ఈ మేర‌కు జూల‌కంటి రంగారెడ్డి మంత్రికి లేఖ రాశారు. ఈఎస్ఐ డిస్పెన్స‌రీలు, ఆస్ప‌త్రుల‌లో హెడీసీ ప‌రిధిలో సుమారు 120మంది కార్మికులు ప‌ని చేస్తున్నార‌ని, వారికి 2019 మార్చి నుంచి వేత‌నాలు పెండింగ్‌లో ఉన్నాయ‌న్నారు.

కార్మికుల‌కు జీతాలు చెల్లించ‌డానికి బ‌డ్జెట్ ఉన్న‌ప్ప‌టికీ కార్మిక‌శాఖ, ఫైనాన్స్ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డంతో వేత‌నాలు పెండింగ్‌లో ప‌డ్డాయ‌న్నారు. కేవ‌లం నెల‌కు రూ.10 వేల‌తో ప‌ని చేసే వారి జీతాలు 16 నెలలుగా నిలిపేయ‌డంతో.. వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయ‌న్నారు. అంతేగాకుండా హైద‌రాబాద్ జాయింట్ డైరెక్ట‌ర్ ప‌రిధిలో విధుల నుంచి తొల‌గించిన 46 మంది ఔట్ సోర్పింగ్ హౌస్ కీపింగ్, వాచ్ మెన్, అటెండ‌ర్ల‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. వీరికి 8 నెల‌ల వేత‌నాలు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, వాటిని కూడా వెంట‌నే అందజేయాలని మంత్రి మ‌ల్లారెడ్డిని కోరారు.



Next Story

Most Viewed