వెంకయ్యనాయుడు తలుచుకుంటే.. దాన్ని ఆపేయవచ్చు

by  |
వెంకయ్యనాయుడు తలుచుకుంటే..  దాన్ని ఆపేయవచ్చు
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైటీకరణపై సీపీఐ జాతీయ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలిగే శక్తి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఆయన మాత్రమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలరని చెప్పుకొచ్చారు. కొన్ని నెలలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నా వెంకయ్యనాయుడు పెదవి విప్పకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా ఆయన పెదవి విప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు విశాఖకు అన్యాయం జరుగుతుంటే మిజోరాం గవర్నర్‌గా ఎంపికైన కంభంపాటి హరిబాబు ఎందుకు మాట్లాడటం లేదని నారాయణ ప్రశ్నించారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకుంటేనే తాను మిజోరాంకు వెళ్తానని హరిబాబు చెప్పాలని అప్పటి వరకు విశాఖలోనే ఉండాలని నారాయణ డిమాండ్ చేశారు. మరోవైపు మోడీ కాళ్ల మీద పడే విజయసాయిరెడ్డి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో తాము ధర్నాకు యత్నించామని… అయితే విజయసాయి వల్ల అది జరగలేదని చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖలు రాస్తున్నారని ఆ లేఖల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. సీఎం జగన్ ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొంటనే ఫలితం ఉంటుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేటు వద్ద జరుగుతున్న పోరాట శిబిరానికి రావాలని సీఎం జగన్‌ను నారాయణ కోరారు.


Next Story

Most Viewed