రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి: సీపీఐ(ఎం)

by  |
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి: సీపీఐ(ఎం)
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్‌ సంస్కరణల బిల్లును వెనక్కు తీసుకోవాలసి సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. రెండో దశ రైతు ఉద్యమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. రైతులకు ఎంతో కొంత అండగా ఉన్న చట్టాలను మార్చి కార్పొరేట్లకు తాకట్టు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అందులో ఆరోపించారు.

కొత్తగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఢిల్లీలో గత 14 రోజులుగా ఎముకలు కొరికే చలిలో కూడా వేలాది మంది రైతులు ఆందోళనలు చేస్తున్నా, కేంద్రం వారిని పట్టించుకోకుండా రైతు నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం తన అహాంకార ధోరణితో ముందుకు పోతూ, మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఈ నెల 14 నుంచి పెద్ద ఎత్తున రెండో దశ ఆందోళనలు నిర్వహించాలని, దేశీయ కార్పొరేట్ల దిగ్గజాలైన రిలయన్స్‌, ఆదాని గ్రూపుల ఉత్పత్తులను, మార్టులను బహిష్కరించాలనే రైతు సంఘాల పిలుపులను సీపీఐ(ఎం) బలపరుస్తూ, 14న జరిగే నిరసన ప్రదర్శనల్లో పార్టీ శ్రేణులు, యంత్రాంగం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed